భుట్ జొలోకియా

ఇది చాలా ఘాటు గురూ !


రిజర్వేషన్ వల్లనే దేశం తిండి తింటోంది కాదంటారా ?

రిజర్వేషన్లు లేకపోతే దేశం బాగు పడుతుంది అంటున్నారు జనాలు !

ఎవర్రా భై, పరీక్షలు పెట్టి, బాగా మార్కులు తెచ్చుకుని మెరిట్లో పాసయినోనికే “రైతు” ఉద్యోగం ఇస్తున్నది ? ఆడ భూమి ఉంటాది, అయ్య రైతు, ఇంట్లో కొడుకు కూడా రైతు అయ్యాడు. ఆ రిజర్వేషన్ “రైతు” పండించిన తిండే మెరిట్ గాల్లందరూ మెక్కుతున్నారు.

తిండి తినేప్పుడు, ఈ బియ్యం, ఈ గోధుమలు మెరిటున్నోడు పండించాడా అని ఎవ్వడూ ఆలోచించండు. దాన్ని పండించడానికి కావలసిన పనిమంతుడు వాటిని పండించాడు అని మాత్రమే ఫీలవుతాడు, హాయిగా తింటాడు.

మ్యాటరేమిటాంటే, ఫలానా పని చేయడానికి కావలసిన మేధా శక్తి ఎంత అన్నదానికి ఒక కొలమానం ఉంటుంది. దానిని మినిమం రిక్వైర్‌మెంట్ అంటారు. అది ఉంటే చాలు. ఇక జెనరల్ కేటగిరీ వాల్లకు, మిగిలిన వాల్లకూ ఉన్న డిఫరెంట్ కట్ ఆఫ్ అనేది, కేవలం ఫలానా పని చేయడానికి అవసరమైన వారికంటే ఎక్కువ మంది ఉన్నారు అన్నదాన్ని తప్ప మరి దేన్నీ సూచించదు. మెరిట్‌కీ ఫలానా పనిచేయడానికి అవసరమైన “మినిమం రిక్వైర్‌మెంటు” కీ సంబందం ఉండదు.

డాక్టరే కాదు, ఇంజక్షన్ నర్సు కూడా చేయగలదు. ఆపరేషన్లు 90% వచ్చినవాల్లే కాదు, 60-70% (లేకపోతే సీ.పీ.ఎ or సీ.జీ.పీ.ఎ) వచ్చినోళ్ళు కూడా చేయగలరు.

అన్నింటికన్నా మించి, రిజర్వేషన్లు ఎంట్రీ ఇవ్వడానికే, ఉత్తీర్ణులవ్వడములో ఏ రిజర్వేషనూ ఉండదు. అందరూ 35 మార్కులతో పాస్ అవ్వాలి లేదా 6 out of 10 తెచ్చుకోవాలి.

ఎంట్రీలో రిజర్వేషన్ కేవలం ఆయా వర్గాలకు కూడా ప్రాధాన్యం అందించించడానికి ఇచ్చిన ఒక చిన్న వెసులుబాటు మాత్రమే !

ఫీ.ఎస్: ఈ సోదంతా చెప్పడానికి కారణం డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి ఈ తరహా మెరిట్ vs రిజర్వేషన్ దూషణలు కూడా కారణమవ్వడం.



Recent Posts

Newsletter

Recent Comments

  1. @బుచికి “జెంస్ ఆఫ్ బాలీవుడ్” కు వారి నిరసన తెలిపే హక్కుంది. కానీ, ఇలా ప్రతీదాన్నీ బాయ్‌కాట్ చేయండి అని ద్వేషాన్ని ప్రచారం చేయడం వల్ల వారికే…

  2. బాయకాట్ అనేది కేవలం ఈ సినిమా మీద ప్రత్యేకమైన కోపం తో కాదు. బాలీవుడ్ ఎన్నో ఏళ్లుగా హిందూ మతాన్ని, హిందూ దేవతలను కించపరుస్తూ, హిందువులను విలన్లగా…

%d bloggers like this: