విరాట పర్వం … ఓ అర్భన్ నక్సల్ – ఓ ఆలోచన !

బీ.జే.పీ ఈ స్థాయిలో దూసుకొస్తున్న వేల
జనాలకు (కొన్ని కులాలకు)
విప్లవాలు, పోరాటాలు, సమానత్వాలు, కులరహిత సమాజాలు
గుర్తుకు రావడమే కాకుండా

ఇన్ని రోజులు మేము మీ ఆడోళ్ళను చేసిన రేపులు,
మీ మగోళ్ళ తెగిన మర్మాంగాలూ,
మీ జీవితం మీద కర్కషంగా మోపిన మా కులబలుపు బూటుకాళ్ళూ,
మీ కులాల్ని రోజూ మీకు గుర్తుకు చేసి,
మీరు ఎక్కడన్నా చిన్నగా ఎదిగితే,
కర్కశంగా అనచేసిన పనులన్నీ మర్చిపోయి,

మరొక్క సారి వర్గ పోరాటానికి రమ్మని,
ఆ హిందూ అతివాదులకు వ్యతిరేకంగా కలిసి పోరాడమనీ,
ఆ పాత పాచిపళ్ళ నోటితో మేము నిస్సిగ్గుగా చెప్పిన అబద్దాలు
మళ్ళీ మళ్ళీ వల్లే వేస్తాం అని,

కుల రహిత సమాజం జిందాబాద్, సమానత్వం, యుటోపియా
స్త్రీపురుషుల సమానత్వం జిందాబాద్ అనండనీ

ఎలుగెత్తి చాటడానికి తీసిన సినిమానే ఈ విరాట పర్వం.

ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలీనంత వరకూ ఆ నినాదాన్ని ఎత్తుకోకు అని ఓ కమ్యూనిష్టు మితృడు నాకు చెప్పాడు. అదేదో సినిమాలో “డోంట్ ట్రస్ట్ అనీ వన్” అని విలన్ హీరోకి చెప్పి చెప్పి, చివరకి వాడే అందరికన్నా ఎక్కువగా నమ్మకూడని వ్యక్తి అని సివరాకర క్లైమాక్సులో రీవీల్ చేసుకుంటాడే ఆడి టైపులో !

అందుకే .. ఈ ఎర్ర జండాల్నీ, ఎర్రి జండాల్నీ, నమ్మకుండా, నీ బతుకు బాట నువ్వు చూసుకో సోదరా ! ఇక్కడ ఉటోపియా అంటే.. ఓ కులం అధికారములోకి రావడం, దేశ భక్తి అంటే ఇంకో కులం అధికారములోకి రావడం. ఆ కులం అందర్నీ ఉద్దరించే కులమనీ, బ్లడ్డు బ్రీడు బాగా ఉన్న కులమనీ లేకపోతే ఎన్నో ఏళ్ళుగా రాజ్యాలు పాలించి, నర నరాళ్ళో ఆ రాజ్యాధికార నాయక లక్షణాలు డి.ఏన్.ఏలో జనాలందరినీ యేలే లక్షణాలూ ఉన్న కులం తమదనీ నమ్మే ఎధవలు బట్టలిప్పుకుని, నగ్నంగా తమ మర్మావయవాలు అందరికీ చూపిస్తూ, వాటిని పొగడమనీ, అవి మన మర్మావయవాల కన్నా శ్రేష్టమైనవనీ మనందరి చేత అంగీకరింప జేయడానికి సామ దాన బేద దండోపాయలనే కాదు, వారికి మాత్రమే చేతనైన మాయోపాయాలు కూడా పన్నే వికృత రోత రొద ఉన్మాద ప్రేలాపన. ఇక్కడ సమానత్వాలు లేవు, కుల రహితాలు లేవు, జెండర్ సెన్సిటివిటీలు అస్సలే లేవ్, వర్గ పోరాటాలు కావు ఇవి.

ఈ సర్కసులోకి నువ్వు రాకు. ఆ కుల చూషణలు చేయకు. హ్యాపీగా, తిను, తాగు, పని చేసుకో, సినిమా చూసుకో, ఎక్కడన్నా విహార యాత్రలకు వెల్లు. జీవితములో చాలా చాలా మధురానుభూతులు పంచేసే పనులు చాలా ఉన్నాయి, అవి చేసుకో ! ఇక్కడికి మాత్రం రాకు !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s