ఉఫ్‌ఫ్‌ఫ్ సంధ్య … స్త్రీల హక్కులు !

విలేఖరి : మేడం మొన్న ఒక మగాడు ఒకమ్మాయి తనని చెంప దెబ్బ కొట్టిందని తిరిగి తిట్టాడట దీనికి మీరేమంటారు ?

ఉఫ్‌ఫ్‌ఫ్ సంధ్య: మహిళ

విలేఖరి : మీరు చెప్పింది అక్షరాలా సత్యం మేడం. మహిళ పట్ల మగవారి ధోరని, వారి పురుషాధిఖ్యాన్ని చూపే విధంగా ఉంది.

విలేకరమ్మ : మేడం మొన్నా మధ్య ఒకావిడ, మొగుడ్ని బ్లేడుతో గొంతుకోసి చంపేసిందట, దీనికి మీరేమంటారు. ఎందుకంటే, ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా ఈమధ్య ఎక్కువవుతున్నాయి కదా ?

ఉఫ్‌ఫ్‌ఫ్ సంధ్య : మహిళ

విలేకరమ్మ: నిజమే మేడం, మీరు చెప్పింది కరక్టే, ఒకటీ అరా కేసులు అవన్నీ, ఒక వేల నిజం అయితే మాత్రం.. రాముడు సీతను అగ్నిలో దూకమనలేదా లేక లక్ష్మణుడు ఊర్మిళని వదిలి వెల్లలేదా ? ఎవరిచ్చారు మేడం ఈ మగాళ్ళకు ఈ హక్కులు. నిజమే చెప్పారు మీరు.

సంతలో సత్రకాయి: మేడం ఈ మధ్య ఒక హీరో టీ.వీ స్టుడియోలో పిలిచి, నువ్వు ఫ్రస్ట్రేటేడా, పాగల్ సేన్ వా అని ప్రాంక్ చేశారటా.. మనోడు రెచ్చి పోయి, “చక్” అని తిట్టేశాడట, దానితో “ఎహే బయటకి పో” అనే లెవల్లో గెట్ అవుట్ అన్నారట, ఇందులో తప్పెవరిది మేడం …?

ఉఫ్‌ఫ్‌ఫ్ సంధ్య : మహిళ

సంతలో సత్రకాయి: కరక్టే మేడం. ఇది ప్రాంక్ ఎలా అవుతుంది, అందునా ఇందులో మహిళ ఇన్వాల్వ్ అయిన తరువాత అది నిజమే అవుతుంది. “బిలీవ్ ఉమన్”. ఈ ముక్క తెలీక చాలా మంది మగాళ్ళూ పురుషాహంకారముతో రెచ్చిపోతున్నారు. అయినా మహిళ తిడితే మాత్రం అంత మాటంటాడా, అతను సారీ చెప్పి ఉండొచ్చు, కానీ మనం యాక్సెప్ట్ చేస్తామా ఏంది ? మహిళ అక్కడ. తరతరాల బాధలను తట్టలో పెట్టుకుని మోస్తోంది. ఎలా ఒప్పుకుంటాం !

ఇంకో సత్రకాయ : మేడం ..
ఉఫ్‌ఫ్‌ఫ్ సంధ్య : ఉష్‌ష్‌ష్ ఎన్ని సార్లు చెప్పాలయ్యా “మహిళ” అని, అర్థం కావట్లేదా..?

ఇంకో సత్రకాయ: ఆహా.. నా ఉద్దేశం అది కాదు మేడం, ఐ యాం ఎక్స్ట్రీములీ సారీ మేడం. మా నాన్నగారు పేరు పొందిన్ గొప్ప మానవ హక్కులవాది, మార్క్సిస్టు, కమ్యూనిస్టూ, లెనినిస్టూ, పుచ్చలపల్లి సుందరయ్య ఇస్టు.. నేను మహిళ గురించి తప్పుగా మాట్లాడతానా మేడం ? మొన్ననే మహిళా దినోత్సవం రోజు నా ఫ్రెండు లిస్టులో ఉండే ఆడోళ్ళందరూ.. “ఏంటయ్యా మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్” అని విసుక్కున్నా కూడా “మార్క్సు వాదిని” కాబట్టి, కర్చీఫుతో మొహం తుడుచుకుని మరీ మహిళల సేవలను పొగిడి, ప్రతీ “ఆడ ఫ్రెండు” కీ శుభాకాంక్షలు చెప్పాను మేడం, ఒకరిద్దరు బ్లాక్ చేసినా కూడా నేను బాదపడలేదు మేడం. వారికి ఆహక్కుంది, నేను బ్లాక్ చేయబడ్డానికే అర్హున్నే అని, వేరే అయిడీతో లాగిన్ అయ్యి వారికి వినయంగా ఆవిషయం తెలియజేశాను మేడం.

ఉఫ్‌ఫ్‌ఫ్ సంధ్య : ఓకే.. అయినా నీలో పురుషాహంకారం కనిపిస్తోంది. “మహిళ” అన్నాను కదా ?

ఇంకో సత్రకాయ: థ్యాంక్యూ మేడం. మగాన్ని కదా మేడం, పురుషాహంకారం కామన్ మేడం. నాలో నేను సంస్కరించుకుంటూ, రోజూ కనీసం నలుగురైదుగురు ఆధునిక భావాలు కలిగిన ఆడవారితో సంస్కరింపబడుతూనే ఉన్నాను మేడం.

విషయానికి వస్తే.. ఇలా మీరు మహిళ, మహిళ అని చెప్పే బదులు ఒక సారి.. టీ.వీ స్టుడియోల్లో, పత్రికాఫీసుల్లో గోడల మీద “ఆమె మహిళ” అని రాయిచ్చారంటే.. “ఓ స్త్రీ రేపురా” టైపులో.. సారీ సారీ.. “We can do it better” టైపులో అందరికీ గుర్తుంటుంది కదా అన్నది నా సజెషన్ మేడం.

ఉఫ్‌ఫ్‌ఫ్ సంధ్య : హ్మ్.. అయిడియా బాగానే ఉంది. కానీ, అప్పుడు పురుషాహంకార మగవాళ్ళూ పాటిస్తారంటావా ? అయినా సరె, అదేదో మీరే రాసుకోండి. చూద్దాం !

పీ.ఎస్ : ఆమె మహిళ అన్నది ఎంత పవర్‌ఫుల్లో, “వీడు మగాడు” అన్నది అంత ధరిద్రం. కాబట్టి, ఫీలవ్వకండి, ఎన్ని తిట్టినా, తన్నినా, చివరకి సంపేసినా ఆపక్కోడు మగోడయితే పెద్ద ఇష్యూ కాదు. సో, కామెంట్ సెక్షన్ మీదే .. కుమ్మేసుకోండి.

P.S 2 : ఎవరయ్యా అది, ఛాందస వాదులు రైట్ వింగులోనే ఉంటారని అన్నది. ఏం మైండు పోయిందా ?

నేను దీన్ని ప్రతిలిపిలో కూడా పోస్టు చేశాను. ఇక్కడ కామెంట్లు కష్టం అనుకుంటే అక్కడకి రండి !

https://telugu.pratilipi.com/story/%E0%B0%89%E0%B0%AB%E0%B1%8D%E2%80%8C%E0%B0%AB%E0%B1%8D%E2%80%8C%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B2-%E0%B0%B9%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-ycqczulajtit

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s