సందీప్ రెడ్డి వంగాకి నా మద్దతు : “టాక్సిక్ మస్కులినిటీ” Vs “టాక్సిక్ ఏంజెల్స్”

ఇప్పుడు సందీప్ వంగా మీద మా కమ్యూనిష్టు “మోరల్ పోలీసులు” గరం గరం మసాలాలు నూరేస్తున్నారు. టాక్సిక్ మస్కులినిటీ అని మరోటనీ. “కబీర్ సింగ్” లేదా “అర్జున్ రెడ్డి” అనేది కేవలం ఒక సినిమా. దానిలో అలాంటి సీన్లు పెట్టడం పెద్ద విషయం కాదు. ఇష్టం ఉంటే చూస్తారు, లేదంటే మానేస్తారు జనాలు.

బేసిగ్గా రొమాంటిక్ సినిమాలన్నింటిలో కాస్త అతి ఉంటుంది. ఆసినిమాలన్నింటిలో హీరోయిన్ను ఒక అపురూప వస్తువులా చూపించేస్తూ ఉంటారు. బేసిగ్గా చెప్పాలంటే “అలాంటి హీరోయిన్” నిజ జీవితములో ఉండదు. ఒక తరాన్ని ఒక ఊపు ఊపిన సినిమా “తొలిప్రేమ” ! అందులో కీర్తి రెడ్డి, అలా “పొగలోనుండి వచ్చి, పొగలోనుండి వెల్లిపోతుంది”. ఎంతో మృదువుగా మాట్లాడుతుంది. బోలెడన్ని ఉన్నత ఆదర్శాలూ ఉంటాయి. అంత సౌమ్యశీలి, అంత ఉన్నత భావాలూ ఉన్న అమ్మాయి బహుషా నిజజీవితములో మనం చూడలేం.

జనాలు టాక్సిక్ మస్కులినిటీ గురించి మాట్లాడతారే కానీ, ఇలాంటీ “టాక్సిక్ ఏంజెల్స్” గురించి ఎందుకు మాట్లాడరు ? అబ్బాయిల్లో చాలా మందికి టాక్సిక్ మస్కులిటీ కన్నా … ఈ “టాక్సిక్ ఏంజెల్స్” మీద అవగాహనే తక్కువ అనిపిస్తుంది నాకు.

మరి ఎవరూ ఈ “టాక్సిక్ ఏంజెల్స్” గురించి మాట్లాడరెందుకు ? ఎందుకంటే, అనవసరం. సినిమా అది.. ఒక రంగు రంగుల కల. జీవితానికీ దానికీ మధ్య పొంతన ఉండదు అని తెలుసుకోవడం ముఖ్యం. కాస్త అనుకరణ అనేది సహజమే అయినా… రియాలిటీ ఏంటో తెలీని జనాలు బహు అరుదుగా ఉంటారు.

కాబట్టి, సినిమాల్లో వీటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు అని నా ఫీలింగ్. కాకపోతే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు రివ్యూలు రాసుకోవచ్చు. అది తప్పేం కాదు. అర్జున్ రెడ్డి” మీద చాలా మంది “కమ్యూనిష్టు ప్రవక్తలు”, “కమ్యూనిష్టు బాబా / సాద్వి”ల రాసిన రివ్యూలు చదివాను “. “అర్జున్ రెడ్డి” మీద వాల్లు చేసినంత “మోరల్ పోలీసింగ్” ఈ మధ్య కాలములో మరే సినిమాకు జరిగి ఉండదు అని చెప్పొచ్చు. “కబీర్ సింగ్” విషయములో కూడా అదే జరిగింది, ఇంకాస్త చెప్పుకుంటే ఇంకొంచెం ఎక్కువే జరిగింది.

వాల్ల రివ్యూలు రాయొద్దు అనను, కానీ వారికి విమర్శించే హక్కున్నట్టే.. మాబోటోళ్ళకి వాటిని తప్పు పట్టే హక్కు కూడా ఉంది అని మాత్రం నిర్మొహమాటంగా చెప్పగలను.

ఒకప్పుడు “శివసేన” వాల్లను తిట్టే వాల్లు, వాల్లు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారని. కానీ, మా కమ్యూనిష్టు బాబాలు / సాధ్వీలు .. శివసేనను మించి పోయి చేస్తున్న మోరల్ పోలీసింగులు చూస్తే నవ్వొస్తుంది.

ఇక సందీప్ వంగా విషయానికి వస్తే, అతడొక “స్వాప్నికుడూ”, సినిమా కూడా అలానే తీశాడు. “రెక్కల గుర్రం ఎక్కి రాజకుమారుడు” తన కోసం వస్తాడు అనే కథ, రానూ రానూ రూపాంతరం చెంది “మాంచి బైకు మీద లేక ఖరీదైన కారులోన” ఒక “సిక్స్ ప్యాకు” కుర్రాడు వస్తాడు అన్నట్టుగా మారిపోయింది.

అలాంటి సిక్సు ప్యాకు లేదా దానికి కాస్త దగ్గరగా ఉండే Toned Body ఉన్న ఓ అందగాడు, బాగా డబ్బున్న (రాజకుమారుడు) కుర్రాడు, తన కోసం పడి చచ్చిపోవడం అనేది “ఆర్డినరీ యుక్త వయస్సున్న అమ్మాయిల” కోరిక. “అర్జున్ రెడ్డి” లేదా “కబీర్ సింగ్” దాన్ని భీభత్సంగా తీర్చేశాడు. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్టయ్యింది.

సినిమాలు దేశ ప్రయోజనాల కోసం, సమాజ హితం కోసం మాత్రమే కాకుండా.. మనలో ఉన్న కొన్ని వికారాలను (ఐటెం సాంగుల రూపములో తీర్చేసుకోవచ్చు), మనో ఉన్న కొన్ని కోరికలను (ఘాటైన ప్రేమ, తొడగొడితే మెరుపులొచ్చే వీరత్వం .. ఒకందమైన అమ్మాయి ఆపదలో ఉంటే కాపాడి, ఆమె ప్రేమను పొందటం .. గట్రా, గట్రా అన్న మాట) విచ్చలవిడిగా తీర్చేసుకోవడానికి కూడా వాడేసుకోవచ్చు.

అదీ మరీ అంత పాపమేమీ కాదని నా ఫీలింగ్. ఈ “అర్జున్ రెడ్డి”, “కబీర్ సింగ్”లు వాటి కోవలోకే వస్తాయి. అవెంజర్స్ సినిమా చూస్తాం, కబీర్ సింగ్/ అర్జున్ రెడ్డి సినిమా చూస్తాం , ఇంటర్వలులో ఒక పాప్ కార్నో, సమోసానో కొనుక్కుని ఒక కూల్ డ్రింకు తాగి.. సినిమా అయ్యాక బయట పడతాం. అంతకన్నా వేరే “సీన్” లేని సినిమాలు ఇవి. వాటికింత డిస్కషన్ ఎందుకు ? టైం వేస్ట్ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s